25 June, 2026 | 2:29 AM

ఇప్పుడే పర్యటనలొద్దు

25-06-2026 12:04 AM

ప్రవాసులకు ఇరాన్‌లోని భారత ఎంబసీ అడ్వైజరీ జారీ

న్యూఢిల్లీ, జూన్ 24 : అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముగింపు ప్రకటనతో ఉద్రిక్తతలు చల్లారుతున్నట్లు కనబడినా, ఇంతలో నే ఇరాన్‌లో పర్యటించవద్దని టెహ్రాన్‌లోని భారతీయ ఎంబసీ అడ్వైజరీ జారీ చే సింది. అనవసర ప్రయాణాలను మానుకోవాలని బుధవారం ఎక్స్‌లో సూచించింది. ఇక్కడ ఇప్పుడిప్పుడే సానుకూల పరిస్థితులు నెలకొంటున్నాయని, పరిస్థితులను ఎప్పటికప్పు డు నిశితంగా పరిశీలిస్తున్నామని ఇక్కడ ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, ఎంబసీ జారీ చేసిన సూచనలను పా టించాలని పేర్కొంది.

ఇరాన్‌కు రావడం అ త్యవసరం అయితే ఎంబసీ అధికారులను సంప్రదించి పేర్లు, వివరాలను నమోదు చే సుకోవాలని తెలిపింది. అమెరికా మధ్య శాంతి ఒప్పందాలు కుదరినప్పటికీ ఇ రుదేశాల ప్రకటనలు భిన్నంగా ఉండడంతో పరిస్థితులు చల్లారుతున్నట్లే చల్లారి భగ్గుమనే అవకాశం లేకపోలేదనే ఆలోచనలతో ఆయా దేశాలు అప్రమత్తతను పాటిస్తున్నా యి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భిన్న ప్రకటనలు ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచెతుతున్నా, ఇరాన్ వాటిని ఖండిస్తూ వస్తుంది.