24 June, 2026 | 12:12 PM

ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు సిద్ధం: వ్లాదిమిర్ పుతిన్

24-06-2026 10:58 AM

మాస్కో: ఉక్రెయిన్(Ukraine)తో శాంతి చర్చలు పునఃప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్లు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Russian President Vladimir Putin) పిలుపునిచ్చారు. పాశ్చాత్య దేశాలు ఉద్దేశపూర్వకంగానే ఉద్రిక్తతలను పెంచుకున్నారని ఆరోపించారు. 2022,2025లో కుదిరిన ఒప్పందాల ఆధారంగా చర్చలు జరపాలని పుతిన్ కోరారు. గత ఒప్పందాల ఆధారంగా శాంతి చర్చలను ముందుకు తీసుకెళ్తామని సూచించారు. రష్యా పౌరులపై ఉక్రెయిన్ దాడులతో ప్రత్యక్ష చర్చలు సాధ్యం కావని స్పష్టం చేశారు. జెలెన్ స్కీ(Volodymyr Zelenskyy) విడుదల చేసిన బహిరంగ లేఖ శాంతి చర్చలకు విఘాతం కలిగిస్తున్నాయని పుతిన్  మండిపడ్డారు. రష్యా చమురు మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ తిరిగి దాడి చేయడంతో ఇంధన కొరత ఏర్పడిన కొద్ది రోజులకే ఉక్రెయిన్‌తో శాంతి చర్చలకు తాను సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించారు.  ఉక్రెయిన్ దాడులను సమాజాన్ని అస్థిరపరిచే ఒక ఎత్తుగడగా అభివర్ణించారు.