వచ్చే నెలలో ఖమేనీ అంత్యక్రియలు
- ఇరాన్ సుప్రీం మాజీ లీడర్‌కు తుది వీడ్కోలుకు ఏర్పాట్లు
- ప్రధాని మోదీకి పిలుపు
టెహ్రాన్, జూన్ 24: వచ్చే నెలలో ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమే నీ అంత్యక్రియలు జరగనున్నాయి. జూలై 5 నుంచి 9 వరకు ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం జరుగుతుందని టెహ్రాన్ వర్గాలు ధృ వీకరించాయి. ప్రజల సందర్శనార్థం ఖమేనీ పార్థివ దేహాన్ని జూలై 4, 5 తేదీలలో టెహ్రాన్‌లోని గ్రాండ్ మొసల్లా సముదాయంలో పెడతారు. జూలై 6న ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియల ఊరేగింపు నిర్వహిస్తా రు.
ఈ కార్యక్రమాల సమయంలో టెహ్రాన్ ప్రావిన్స్‌లో ప్రభుత్వ సెలవు ప్రకటించారు. 9న ఖమేనీ భౌతికకాయాన్ని ఆయన స్వస్థ లం మషాద్‌లో ఖననం చేయనున్నారు. కా గా ఖమేనీ అంత్యక్రియల్లో హాజరు కావాలని భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఆ దే శాధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ పిలుపునిచ్చినట్లు దౌత్యవర్గాలు వెల్లడించాయి.
అమె రికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో ఖమే నీ (86), 40 మంది సైనికాధికారులు మృతి చెందారు. ఆయన కుటుంబంలోని కుమార్తె, అల్లుడు, కోడలు, మనవరాలు మృతి చెంద గా, కుమారుడు మొజ్తాబా గాయపడినట్లు వార్తలు వెలువడ్డాయి. అటుపిమ్మట మొజ్తాబాను సుప్రీంలీడర్‌గా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఐదు నెలల తరువాత ఖమేనీ అంత్యక్రియలు నిర్వహించడం సర్వత్రా ఆసక్తి రేపుతుంది.






