12 June, 2026 | 2:31 AM

ప్రైవేట్ పాఠశాల వద్దు..ప్రభుత్వ పాఠశాల ముద్దు..

12-06-2026 12:20 AM

జరాసంఘం ఎంఈఓ వినూత్న ప్రచారం 

జహీరాబాద్, జూన్ 11 : బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు మం డల విద్యాధికారి వినూత్న ప్రచారానికి శ్రీకా రం చుట్టారు. జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండల విద్యాధికారి శ్రీనివాస్ ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడిలోని చేర్పించాలని ప్రయత్నం చేశారు. ప్రతిరోజు ఉపాధ్యాయులతో కలిసి గ్రామంలో పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించేందుకు ప్రయ త్నించగా ప్రయత్నం విఫలమైంది.

ఉపాధ్యాయులు పిల్లల తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లి పిల్లలను బడిలో చేర్పిస్తారేమోనని వెళ్ళగా ఆ ఇంటిలోని వారందరూ ఉపాధి హామీ కూలీ పనికి వెళ్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన శ్రీనివాస్ ఉపాధి హామీ ఈ ప్రాం తంలో ఏం చేస్తున్నారో తెలుసుకొని ఆ ప్రాం తంలో ఉన్న కూలీలతో కలిసి తమ పిల్లలను ప్రభుత్వ బడిలోనే చేర్పించాలని వారిని కోరా రు. ఈ సందర్భంగా ఎంఈఓ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ బడిలో తమ పిల్లలను చేర్పించినట్లయితే రాబోవు కాలం లో వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ పాఠశాలలో పాఠ్య పుస్తకాలతో పాటు నోటు బుక్కులు, బట్టలు, మ ధ్యాహ్న భోజనం అన్ని సౌకర్యాలు ప్రభు త్వం కల్పిస్తున్నందున తమ పిల్లలను ప్రభు త్వ బడికి పంపించాలని కోరారు. ప్రైవేటు బడి వద్దు ప్రభుత్వ బడి ముద్దు అనే నినాదంతో పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించాలని, బర్దిపూర్ లోని ప్రభుత్వ పాఠశాలలో ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా విద్యాబోధన జరుగుతుందని, దీనికి తోడు డిజిటల్ క్లాసులు కూడా నిర్మించ బడతాయని ఆయన ఉపాధి హామీ కూలీలతో తెలిపారు. గ్రామ సర్పంచ్ రాజు మాట్లాడుతూ గ్రామంలోని బడీడు పిల్లలందరినీ సాధ్యమైనంతవరకు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు,  వార్డు మెంబర్లు పాల్గొన్నారు.