12 June, 2026 | 1:24 AM

కండ్లకోయలో ‘బొడ్రాయి’ ఉత్సవాలు

12-06-2026 12:19 AM

గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు

మేడ్చల్ అర్బన్, జూన్ 11 (విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండ్లపోచంపల్లి మున్సిపల్ డివిజన్ పరిధిలో గల కండ్లకోయ లో 3వ బొడ్రాయి పండుగ సందర్భంగా అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పట్టణ వాసులు వేద పండితుల ఆశీస్సులు తీసుకొని బొడ్రాయి వద్ద కొబ్బరి కాయలు కొట్టి మా కుటుంబ సభ్యులు సుఖ సంతోషాలతో అష్ట ఆయురారోగ్యాలతో ఉండేలా దీవించాలని కోరుకుంటూ పూజలు నిర్వహించారు.

కండ్లకోయ మున్సిపల్ పట్టణ పె ద్దల ఆధ్వర్యంలో బొడ్రాయి పండుగ వార్షికోత్సవ వేడుకలను పెద్ద ఎత్తున నిర్వ హించటడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కండ్లకోయ గ్రామ మాజి సర్పంచ్ కందాడి నరేందర్ రెడ్డి,బిజెపి మాజి కౌన్సిలర్ సముద్రాల హంసరాణి కృష్ణ గౌడ్ దంపతులు మాట్లాడుతూ కండ్లకోయ మున్సిపల్ పట్టణంలో పట్టన వాసులు ఏక మై బొడ్రాయి పండుగ ఉత్సవాలను ప్రతి యేట ఘనంగా నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు సముద్రాల కృష్ణ గౌ డ్, వెంకటేష్ ముదిరాజ్, యంబ రాజు, రాజేందర్ ముదిరాజ్, పెంటయ్య, శివ, బిక్షపతి, శ్రీకాంత్, యంబ ప్రభాకర్, శ్రీనివాస్, ఎర్రోళ్ల యాదగిరి, ప్రవీణ్‌తో పాటు పట్టణ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.