రైతుల పేరుతో డ్రామాలు వద్దు
- కేటీఆర్ శవరాజకీయాలు మానుకోవాలి
- మీ పాలనలోనే మిల్లర్లతో కుమ్మక్కయ్యారు
- కేటీఆర్‌పై మంత్రి ఉత్తమ్ ఫైర్
హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి): రైతుల పేరుతో బీఆర్‌ఎస్ నేతలు ఆడుతున్న డ్రామా పరాకాష్టకు చేరిందని, అందుకు కేటీఆర్ చేసిన ప్రకటననే అద్దం పడుతోందని, ఈ డ్రామాలు ఇకనైనా ఆపాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి ఉత్త మ్ కుమార్‌రెడ్డి మండిపడ్డారు. నిజానిజాలు తెలుసుకోకుండా శవరాజకీయాలు చేయ డం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. 20 కోట్ల 86 లక్షల గన్నీ బ్యాగులు అందుబాటులో ఉన్నాయన్నారు. శుక్రవారం ఆయన విమర్శించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహారిస్తుందని, ప్రతి విషయా న్ని బహిర్గతం చేస్తున్నామని ఉత్తమ్‌వివరించారు.
బీఆర్‌ఎస్ పాలనలో మిల్లర్లతో కుమ్మక్కై రైతాంగాన్ని నిలువు దోపిడీకి పాల్పడిన వాళ్లు ఇప్పుడు ధాన్యం కొనుగోళ్ల పై మాట్లాడడం విడ్డురంగా ఉందని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా 2023 రబీ సీజన్‌లో 8691 కోట్ల విలువైన 39.51 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ.6,112 కోట్లు చెల్లించామన్నారు. 2024- రబీలో ఇదే మే 22 నాటికి రూ.14,010 కోట్ల విలువైన 60.44 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ.10,882 కోట్లు చెల్లించామన్నారు.
ప్రస్తుత రబీలో అదే మే 22 తేదీ నాటికి రూ. 11,499 కోట్ల విలువైన 48.21 లక్షల మెట్రిక్ టన్నుల దాన్యం కొనుగోలు చేసి రూ.8,203 కోట్లు చెల్లించినట్లు తెలిపారు. 32 జిల్లాలకు కలిపి రబీ సీజన్‌కు 11,29,72,831 కోట్ల కొత్త గన్నీ బ్యాగులు కొనుగోలు చేసిందన్నారు. 32 జిల్లా కేంద్రాల్లో 67,39,09,358 గన్నీ బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. ధాన్యాన్ని తరలించేందుకు 1,300 వాహనాలను వినియోగిస్తున్నామని ఉత్తమ్ తెలి పారు. కేటీఆర్ వ్యాఖ్యాలు రాజకీయ ప్రయోజనాల కోసమేనని స్పష్టమవుతోందన్నారు.






