ప్రేమ విఫలం.. యువకుడి ఆత్మహత్య
23-05-2026 12:59 AM
నాగోల్, మే 22 (విజయక్రాంతి): నాగోల్ పరిధిలో ప్రేమ వ్యవహారం విషాదానికి దారితీసింది. తట్టియన్నారం ప్రాంతానికి చెందిన పాండుగాయల సుబ్బారావు పోలీసులకు ఇ చ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. సుబ్బారావు పెద్ద కుమారుడు పి. తిరుమల్ (24) ప్రైవేట్ ఉద్యోగి. మూడేళ్ల క్రితం ఇన్స్‌స్టాగ్రామ్‌లో పరి చయమైన ఓ యువతితో ప్రేమబంధం కొనసాగించాడు. మూడు నెలల క్రితం ఆ యువతి తిరస్కిరిం చడంతో తిరుమల్ మనస్తాపానికి గురయ్యా డు.
మే 21 రా త్రి కుటుంబ సభ్యులతో కలిసి భోజనం చేసిన అనంతరం అందరూ నిద్రపోయారు. మరుసటి రోజు ఉదయం తిరు మల్ గది తలుపు తెరవకపోవడంతో కుటుం బీకులు పరిశీలించగా అతను మృతిచెందాడు. నాగోల్ పోలీ సులు కేసు దర్యాప్తు చేపట్టారు.






