పాలమూరు క్రీడాకారులకు బీఎస్సార్ భరోసా!
- ప్రభుత్వ సహకారం లేకున్నా సొంత మైదానం ఏర్పాటు
- క్రీడాకారులకు ఆసరాగా నిలుస్తున్న బిఎస్‌ఆర్ అకాడమీ
- రాష్ట్రవ్యాప్తంగా వివిధ అకాడమీ లతో పోటీల నిర్వహణ
- క్రీడాకారుల చూపు బీఎస్‌ఆర్ అకాడమీ వైపు
- బండమీదిపల్లి శివారులో రూపుదిద్దుకున్న బీఎస్‌ఆర్ క్రికెట్ అకాడమీ
మహబూబ్‌నగర్, మే 22 (విజయ క్రాంతి): క్రీడలలో గెలుపు ఓటములు సహ జం. చదువుతోపాటు ప్రతి ఒక్కరు క్రీడారంగంలో ఏదో ఒక ప్రావీణ్యత సంపాదించా లని లక్ష్యంతో పరుగులు తీస్తుంటారు. ఇటీవల క్రికెట్ అంటే తెలియనివారు లేరు. దీంతోపాటు ఇంత డిమాండ్ ఉన్న క్రికెట్ కు తోడ్పాటు అందించినప్పటికీ పాలమూరు జిల్లా నుంచి మెరుగైన క్రీడాకారులను తయారు చేయాలని సంకల్పంతో బిఎస్‌ఆర్ అకాడమీ విశాలమైన ప్రాంతంలో స్థలంలో ప్రత్యేకంగా క్రికెట్ క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేశారు.
ఎన్నో వ్యాపారాలు ఉన్నప్పటికీ కొంతమంది నైనా క్రీడాకారులను తయారుచేసి వారి భవిష్యత్తుకు పునాది వేయాలని సంకల్పంతో బిఎస్సార్ నిర్వాహకులు పట్టుదలతో ప్రత్యేక మైదానాన్ని ఏర్పా టు చేసి నిర్విరామంగా కోచింగ్ అందిస్తూ తమదైన ప్రత్యేకతను కనపరుచుతున్నారు.
కరువు జిల్లా కాదు.. క్రీడాకారుల జిల్లాగా..
గతంలో పాలమూరు జిల్లా అంటే కరువు జిల్లాకు కేరాఫ్ గా ఉండేది. ఆసక్తి ఉన్న వ్యక్తులు వివిధ క్రీడలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ అడుగులు వేస్తున్నారు. ఈ తరుణంలోని పాలమూరు జిల్లా కేంద్రంలో ప్రత్యేకమైన గ్రౌండ్ ఏర్పాటు చేసి ఆసక్తి ఉన్న క్రీడాకారులకు ప్రత్యేక కోచింగ్ నిర్వాహకులు అందరి మన్ననలు పొందు తున్నారు.
దేశానికి క్రీడాకారులను తయారు చేయడం మా సంకల్పం
మా శక్తి వరకు లేకుండా దేశానికి క్రీడాకారులను తయారుచేయని సంకల్పంతో మైదానాన్ని ఏర్పాటు చేశాం. చాలామంది క్రీడాకారులు మైదానాన్ని సంప్రదిస్తున్నారు. క్రీడాకారుల ఆసక్తి చూస్తే నేను పడ్డ శ్రమ ఊరికి పోదు ఏదో ఒక రోజు విజయం సాధిస్తాం. క్రమం తప్పకుండా కోచింగ్ ఇస్తున్నాం.
శ్రీనివాస్, బిఎస్‌ఆర్ క్రికెట్ అకాడమీ నిర్వాహకులు
మంచి క్రీడాకారులను తయారు చేయడమే లక్ష్యం
విద్యార్థులు ఒకవైపు చదువుకుంటూ మరోవైపు క్రికెట్ పై ఆసక్తి పెంచుకుంటున్నారు. ఒక లక్ష్యం నిర్దేశించుకున్న వారికి గమనించి వారిని ఆ లక్ష్యం వైపు తీసుకుపోయేలా కోచింగ్ అందిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా వివిధ అకాడమీ లతో మా సమస్యకు సంబంధించిన క్రికెట్ క్రీడాకారులు ఆడి విజయ తీరాలకు చేరారు. మునుముందు మరింత ఉన్నత లక్షలకు చేరుకునేలా బిఎస్‌ఆర్ క్రికెట్ అకాడమీ తీర్చిదిద్దుతుంది.
నవాజ్, బీఎస్‌ఆర్ క్రికెట్ కోచ్, మహబూబ్ నగర్






