23 May, 2026 | 1:19 AM

కంచి పీఠాధిపతి ప్రత్యేక పూజలు

23-05-2026 12:31 AM

స్వామివారిని దర్శించుకున్న శంకర విజయేంద్ర సరస్వతి

యాదగిరిగుట్ట, మే 22 (విజయక్రాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం కంచి పీఠాధి పతి శ్రీశంకర విజయేంద్ర సరస్వతి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాదాయ కమిషనర్ హనుమంతరావు, ఆలయ ఈవో భవాని శంకర్, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ప్రధాన అర్చకులు తదితరులు కంచి పీఠాధిపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం కంచి పీఠాధిపతి స్వామివారిని దర్శించుకున్నారు.

అలాగే స్వా మివారి అనుబంధ ఆలయం పర్వతవర్డుని రామలింగేశ్వర ఆలయంలో శంకర విజయేంద్ర సరస్వతి ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అనంతరం కళా వేదిక వద్ద భజన కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పం డితులతో చతుర్వేద పారాయణం అనంత రం విజయేంద్ర సరస్వతి భక్తులకు ఉద్దేశించి ప్రసంగించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా సీఎం రేవంత్‌తో కంచి పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పాల్గొంటారు.