23 May, 2026 | 2:37 AM

డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో రోల్ మోడల్

23-05-2026 12:18 AM
  1. దేశానికే తెలంగాణను ఆదర్శంగా తీర్చిదిద్దేలా కృషి
  2. పౌరసేవలు ప్రజలకు మరింత చేరువయ్యేలా రోడ్ మ్యాప్
  3. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనాన్స్ సమ్మిట్  2026లో మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, మే 22 (విజయక్రాంతి) : డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో తెలంగాణను ఇతర రాష్ట్రాలకు రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేర్కొన్నా రు. ఇందులో భాగంగా ప్రభుత్వ పౌర సేవలను మరింత సమర్థవంతంగా, పార దర్శ కంగా ప్రజల ముంగిటకే చేర్చేలా  కాంప్రహెన్సివ్ రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నామని తెలి పారు. ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఛార్టర్డ్ అ కౌంటెంట్స్ ఆఫ్ ఇండియా(ఐసీఏఐ) ఆధ్వర్యం లో శుక్రవారం నోవాటెల్ హెచ్‌ఐసీసీలో నిర్వహించిన డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఫైనా న్స్ సమ్మిట్   ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సం దర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడు తూ.. ప్రస్తుతం గ్లోబల్ ఎకానమీ ఊహించని వేగంతో డిజిటల్ వైపు దూసుకుపోతోందని, సంప్రదా య పద్ధతుల స్థానంలో వ్యవస్థను రీ-డిఫైన్ చేసే సరికొత్త డిజిటల్ ఈక్వేషన్స్ తెరపైకి వచ్చాయన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచిందన్నారు.  

భారత్‌కు గ్రోత్ ఇంజన్ తెలంగాణ

 గ్లోబల్ డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో భార త్ సాధిస్తున్న ప్రగతికి తెలంగాణ గ్రోత్ ఇంజన్‌లా మారిందని మంత్రి పేర్కొన్నారు. 2047 నాటికి దేశ జీడీపీలో మన వాటాను10 శాతానికి చేర్చాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఒకప్పుడు కేవలం సంప్రదాయ బుక్ కీపింగ్, అకౌంట్స్ ఆడిటింగ్‌కే పరిమితమైన సీఏలు.. నేడు కార్పొరేట్ సంస్థలకు ‘స్ట్రాటజిక్ బిజినెస్ అడ్వైజర్లుగా రూపాంతరం చెందారని తెలిపారు. ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీ తదితర ఎమర్జింగ్ టెక్నాలజీస్ వల్ల ఫైనాన్స్ రంగంలో సరికొత్త అవకాశాలు వస్తున్నాయన్నారు. ఇలాంటి తరుణం లో సీఏలు కేవలం ఫైనాన్షియల్ ఆడిటింగ్‌కే పరిమితం కాకుండా ‘సైబర్ అష్యూరెన్స్’కూ ప్రాధాన్యమివ్వాల్సిన అవసరముందన్నారు.

మారుతున్న ట్రెండ్స్‌కు స్కిల్లింగ్, అప్ స్కిల్లింగ్, రీ స్కిల్లింగ్ పై దృష్టి సారించాలని సూచించారు. ఈ అంశంలో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఅండ్‌ఏజీ ఆనంద్ మోహన్ బజాజ్, సెర్ట్  ఇన్ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ సోలంకి, ప్రిన్సిపల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్‌కంట్యాక్స్ ఇన్వెస్టిగేషన్ రాజగోపాల్ శర్మ, సెబీ సీజీఎం సాహిల్ మాలిక్, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఎస్పీ హర్షవర్థన్, ఆర్బీఐ సీజీఎం శైలజారాణి జంపాల, ఎన్‌ఎస్‌ఈ సీఐఎస్వో రాజేష్ థాపర్, డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సీఈవో వినాయక్ గాడ్సే తదితరులు పాల్గొన్నారు.