గుట్ట అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
యాదాద్రి భువనగిరి, మే 22 (విజ యకాంతి): ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరి గుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని శుక్రవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకు లు వేద ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా రాంచందర్‌రావు విలేకరులతో మాట్లాడుతూ కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గుట్టకు వచ్చిన సందర్భంగా ఆయన్ని మర్యాదపూర్వ కంగా కలవనున్నట్లు తెలిపారు.
ఆయన ఆశీస్సులు రాష్ట్ర ప్రజలపై ఉండాలని కోరుకుం టున్నట్లు పేర్కొన్నారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి హిందువులు వస్తున్నా రని, హైదరాబాద్ దగ్గరగా ఉండడంతో భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందన్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధికీ బీజేపీ ఎప్పటికీ కట్టుబడి ఉంటుందన్నారు. గుట్టకు జాతీయ రహదారులు, ఎంఎంటీఎస్ రైళ్లను మంజూరు చేసింది కేంద్ర ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు స్వామి వారి దర్శనానికి వస్తున్నారన్న సమాచారంతో కొండపైన వర్తక సంఘం నాయకులు ఒక్కసారిగా గుమికూడి ఆయన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వర్తక సంఘాన్ని రద్దు చేయాలని, టెండర్లు వేయాలని ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.






