అధికారుల సమన్వయంతో పటిష్ట చర్యలు
జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్
మెదక్, మే 22(విజయ క్రాంతి) : పర్యాటక శోభ సంతరించుకునే విధంగా పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో స్వామి బావినీ తుది మెరుగులతో పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ తెలిపారు. పర్యాటక వారోత్సవాల సందర్భంగా ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాల నేపథ్యంలో శుక్రవారం ఉదయం మెదక్ దాయార పురాతన కట్టడాలైన బావి, దేవాలయాలు సందర్శించిన జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ , అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ చైర్మన్ రాధిక భూపతి రాజు, వైస్ చైర్మన్ దొంతి నరేష్ గౌడ్, మెదక్ ఆర్డీవో రమాదేవి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, వ్యాయామ ఉపాధ్యాయులు యువత,ఇతర ప్రజాప్రతినిధులు గ్రామస్తులతో కలిసి సందర్శించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా పర్యాటక వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా దాయారంలోని స్వామి బావిని పరిశీలించడం జరిగిందని పురాతన స్వామి బావి ఈ ప్రాంతంలో ఉన్న పురాతన దేవాలయాలను సందర్శించామని స్వామి బావిని ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టి తుది మెరుగులతో భావిని పునరుద్ధరించి భావితరాలకు భావి గొప్పతనాన్ని తెలి పే విధంగా తీర్చిదిద్దుతామన్నారు.
మెదక్ జిల్లాలోని పర్యాటక శోభ సంతరించే విధంగా కార్యక్రమాలు చేపట్టి పర్యాటక ప్రాంతాలను తుది రూపు తీసుకువచ్చే విధంగా పర్యాటక పురావస్తు శాఖ అధికారుల సమన్వయంతో మౌలిక వసతులు కల్పనపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






