పేకాట స్థావరంపై దాడి
22-05-2026 09:08 PM
ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలంలోని వేముకుంట గ్రామ శివారులో పేకాట స్థావరంపై గురువారం స్థానిక పోలీసులు దాడులు నిర్వహించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2,650/- రూపాయల నగదు, రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.మరో నలుగురు పరారీలో ఉన్నారు.వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ములకలపల్లి ఎస్.ఐ మధు ప్రసాద్ తెలిపారు.






