గల్ఫ్‌లో నిర్మల్ వాసి మృతి
25-06-2026 12:33 AM
మృతుడి కుటుంబానికి అండగా ఎమ్మెల్యే మహేశ్వర్‌రెడ్డి
నిర్మల్, జూన్ 24 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం వైకుంఠాపూర్ గ్రామానికి చెందిన లగ్గాం జగదీష్ ఉపాధి నిమిత్తం దుబాయ్‌కి వెళ్లాడు. ఈ నెల 21న దుబాయ్‌లో ప్రమాదవశాత్తు జరిగిన ఆక్సిడెంట్‌లో జగదీష్ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, మండల బీజేపీ నాయకులు సమాచారాన్ని ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయన వెంటనే స్పందించి సంబంధిత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారులతో, ఎన్‌ఆర్‌ఐ సెల్ అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మృత దేహాన్ని స్వదేశానికి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు.






