కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మీడియా కోఆర్డినేటర్‌గా మద్ది చైతన్య రెడ్డి
ఎల్బీనగర్, జూన్ 24 : తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ యువజన మీడియా కోఆర్డినేటర్ గా కర్మన్ ఘాట్ డివిజన్ మాధవ నగర్ కాలనీకి చెందిన మద్ది చైతన్య రెడ్డి నియామితులయ్యారు. ఈ మేరకు మద్ది చైతన్య రెడ్డికి ఇండియన్ యూత్ కాంగ్రెస్ మీడియా నేషనల్ చైర్మన్ వరుణ్ పాండే బుధవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ సంక్షేమ పథకాలు యూత్ కార్యక్రమాలు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు మీడియా ద్వారా సమాజానికి ప్రజలకు తెలియజేస్తానన్నారు.
తనపై నమ్మకం ఉంచి తనకు పదవి రావడానికి సహకరించిన కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు, ఎంపీ కార్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, టీ పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్, యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కిడి శివచరణ్ రెడ్డి, నేషనల్ కాంగ్రెస్ పార్టీ మీడియా కోఆర్డినేటర్ శైలేందర్, తెలంగాణ రాష్ట్ర మీడియా చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు.






