17-02-2026 12:43:16 AM
వనపర్తి, ఫిబ్రవరి 16 ( విజయక్రాంతి ) : వనపర్తి జిల్లాలో ఫిబ్రవరి 11న నిర్వహించిన 2వ సాధారణ పురపాలక ఎన్నికల అనంతరం వనపర్తి, పెబ్బేరు, కొత్తకోట, ఆత్మకూ రు, అమరచింత పురపాలక సంఘాల్లో కొత్త కార్యవర్గాల ఏర్పాటు ప్రక్రియ సోమవారంతో పూర్తుంది. సోమవారం ఆయా పుర పాలక సంఘాల కార్యాలయాల్లో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమాలు నిర్వహించా రు.
అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల పరోక్షంగా నిర్వహించారు. వనపర్తి మున్సిపాలిటీ లో ఆర్డీవో సుబ్రహ్మణ్యం ప్రత్యేక అధికారిగా వ్యవహరించి, నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకా రం చేయించారు. అనంతరం మధ్యా హ్నం 12:30 గంటలకు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల మద్దతుతో 33వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ మిడి దొడ్డి మాధవి చైర్పర్సన్గా, 10వ వార్డు కాం గ్రెస్ కౌన్సిలర్ గురకొండ మధుసూదన్ గౌ డ్ వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
పెబ్బేరు మున్సిపల్ చైర్మన్‌గా శ్రీనివాస్ గౌడ్
పెబ్బేరు మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ రెవెన్యూ ఖీమ్య నాయక్ ప్రత్యేక అధికా రిగా వ్యవహరించి, నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ అక్కి శ్రీనివాస్ గౌడ్ చైర్పర్సన్గా, కాంగ్రెస్ కౌన్సిలర్ సుమిత్ర పరమయ్య వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
కొత్తకోట మున్సిపల్ చైర్ పర్సన్‌గా అరుణ పోతులపల్లి
కొత్తకోట మున్సిపాలిటీలో అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) యాదయ్య ప్రత్యేక అధికారిగా వ్యవహరించి, నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనం తరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ అరుణ పోతుల పల్లి చైర్పర్సన్గా, కాంగ్రెస్ కౌన్సిలర్ పి పల్లవి వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు.
ఆత్మకూరు మున్సిపల్ చైర్పర్సన్‌గా నాగమణి
ఆత్మకూరు మున్సిపాలిటీలో డి ఎల్ పి ఓ రఘునాథ్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించి, నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకా రం చేయించారు. అనంతరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. సభ్యు ల మద్దతుతో కాంగ్రెస్ కౌన్సిలర్ జీ నాగమ ణి చైర్పర్సన్గా, కాంగ్రెస్ కౌన్సిలర్ ఎం శ్రీనివాసులు వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రక టించారు.
అమరచింత మున్సిపల్ చైర్ పర్సన్‌గా జింక సువర్ణ
అమరచింత మున్సిపాలిటీలో జడ్పీ డిప్యూటీ సీఈవో రామ మహేశ్వర్ ప్రత్యేక అధికారిగా వ్యవహరించి, నూతన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనం తరం చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలను నిర్వహించారు. సభ్యుల మద్దతుతో బీఆర్‌ఎస్ కౌన్సిలర్ జింక సువర్ణ, చైర్పర్సన్గా, కాంగ్రెస్ కౌన్సిలర్ జి రాధ వైస్ చైర్పర్సన్గా ఎన్నికైనట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయా మున్సిపాలిటీల కమిషనర్లు, తహసిల్దార్లు ఇతర ఎన్నికల అధికారులు తదితరులు పాల్గొన్నారు