calender_icon.png 17 February, 2026 | 10:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ పీఠంపై తుమ్మల

17-02-2026 12:45:51 AM

  1. ఉత్కంఠకు తెరదించిన గద్వాల్ శాసనసభ్యులు
  2. తన రాజకీయ చతురతతో మున్సిపల్ పీఠంపై కాంగ్రెస్
  3. గద్వాల అభివృద్ధికినా సహకారం ఎప్పుడూ ఉంటుంది శాసనసభ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి
  4. ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఓటు వినియోగించుకున్న ఎంపీ మల్లు రవి
  5. ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించిన అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు

గద్వాల ఫిబ్రవరి 16 : గద్వాల పురపాలక సంఘం చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికను రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనల ప్రకారం సజావుగా నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) నర్సింగరావు తెలిపారు. సోమవారం గద్వాల పుర పాలక సంఘం కార్యాలయంలో కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించి 37 వార్డుల సభ్యులుగా ఎన్నికైన కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం, చైర్ పర్సన్, వైస్ ఛైర్మన్ పదవుల ఎన్నిక కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ నర్సింగరావు అధ్యక్షతన నిర్వహించారు.

ముందు గా ఎన్నికైన సభ్యులతో అదనపు కలెక్టర్ ప్ర మాణ స్వీకారం చేయించారు. అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 12:30 గంటలకు చైర్ పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కార్యక్రమం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ తరపున 33వ వా ర్డు నుంచి కౌన్సిలర్ గా ఎన్నికైన జయలక్ష్మిని చైర్ పర్సన్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున 35వ వార్డు నుంచి ఎన్నికైన ఎండి బాబర్ ప్రతిపాదించగా, 28వ వార్డు నుంచి కౌన్సిల్ సభ్యుడిగా ఎన్నికైన చంద్రశేఖర్ బలపరిచారు.

బిఆర్‌ఎస్ పార్టీ తరపున పోటీ చేసి 23వ వార్డు సభ్యురాలిగా గెలుపొందిన అని త కుమారిని అదే పార్టీ నుంచి ఏడవ వార్డు సభ్యుడిగా గెలుపొందిన జగదీష్ చైర్ పర్సన్ అభ్యర్థిగా ప్రకటించగా, 20వ వార్డు సభ్యు లు నరసింహులు ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. చేతులెత్తే విధానంలో ఇరు పార్టీల నుంచి చైర్పర్సన్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్న వారిలో మొదట అనిత కుమారికి చేతులెత్తే విధానంలో ఓటు వేయాల్సిందిగా అదనపు కలెక్టర్ నర్సింగరావు కోరారు.

బిఆర్‌ఎస్ నుంచి గెలుపొందిన 11మంది సభ్యులు అని త కుమారికి మద్దతుగా చేతులెత్తే విధానం ద్వారా మద్దతు ప్రకటించారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ తరపున చైర్పర్సన్ అభ్యర్థిగా బరిలో నిలిచిన జయలక్ష్మికి మద్దతుగా కాం గ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన 16 మంది, స్వతం త్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఇరువురు, ఎంఐఎం నుంచి గెలుపొందిన ఒకరు మొ త్తం 19 మంది కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేతులెత్తే విధానంలో నా గర్కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ సభ్యు లు మల్లు రవి చెయ్యి ఎత్తు విధానం ద్వారా ఓటు వేయడంతో మొత్తం కోరంకు కావలసిన 20 మంది మద్దతు ఉండడంతో జయ లక్ష్మిని గద్వాల పురపాలక సంఘం చైర్పర్సన్ గా ఎన్నికైనట్లు అదనపు కలెక్టర్ నర్సింగరావు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రమే విప్ జారీ చేయడం జరిగిందని, ఇతర పార్టీల నుంచి విప్ జారీ చేయబడలేదని ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సిం గరావు పేర్కొన్నారు.

అనంతరం వైస్ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ నుంచి 14వ వార్డు సభ్యు డు శంకర్ ను 9వ వార్డు నుంచి కాంగ్రెస్ సభ్యులుగా గెలుపొందిన రామలింగేశ్వర కా మ్లే ప్రతిపాదించగా, 3వ వార్డు నుంచి అదే పార్టీ అభ్యర్థిగా గెలుపొందిన నాగులు  బలపరిచారు. బిఆర్‌ఎస్ పార్టీ వైస్ చైర్మన్ అ భ్యర్థిగా 21 వార్డు నుంచి గెలుపొందిన పులిపాటి వెంకటేష్ ను 20వ వార్డు సభ్యులు నరసింహులు ప్రతిపాదించగా, ఐదవ వార్డ్ సభ్యులు చిన్నసంటన్న బలపరిచారు.

మొద ట పులిపాటి వెంకటేశు కు చేతులెత్తే విధానంలో ఓటు వేయాల్సిందిగా అదనపు కలెక్ట ర్ నర్సింగరావు కోరగా 11 మంది సభ్యులు అతనికి మద్దతు పలికారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచిన శంకర్ కు 16 మంది కాంగ్రెస్ సభ్యులతోపాటు, స్వతంత్ర అభ్యర్థులుగా గెలుపొందిన ఇరువురు, ఎంఐఎం నుంచి గెలుపొందిన ఒకరు మొత్తం 19 మం ది కౌన్సిల్ సభ్యులు, ఎక్స్ అఫీషియో సభ్యులుగా చేతులెత్తే విధానంలో నాగర్ కర్నూలు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యులు మల్లు రవి చేతులెత్తే విధానం ద్వారా ఓటు వేయడంతో మొత్తం కోరంకు కావలసిన 20 మంది మద్దతు ఉండడంతో శంకర్ ను వైస్ చైర్మన్ గా ఎన్నికైనట్లు అదనపు కలెక్టర్ న ర్సింగరావు ప్రకటించారు.

అనంతరం చైర్పర్సన్ గా ఎన్నికైన జయలక్ష్మి తో, వైస్ చైర్మన్ గా ఎన్నికైన శంకర్ తో అదనపు కలెక్టర్ నర్సింగరావు ప్రమాణ స్వీకారం చేయించారు.ఈ కార్యక్రమంలో గద్వాల శాసనస భ్యులు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గద్వాల మున్సిపల్ కమిషనర్ జానకి రామ్ సాగర్, ఇతర ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.