29 June, 2026 | 1:07 AM

టీయూడబ్ల్యూజే ఇల్లందు డివిజన్ మహాసభలో నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక

29-06-2026 12:00 AM

ఇల్లెందు, జూన్ 28 (విజయక్రాంతి): తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఇల్లందు డివిజన్ మహాసభ ఆదివారం ఇల్లందు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ సమీపంలో గల బాలాజీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. దుద్దుకూరి సుమంత్, ఎండి పాషాల అధ్యక్షతన నిర్వహించిన ఈ మహాసభకు డివిజన్ పరిధిలోని విలేకరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టుల సమస్యలు, భవిష్యత్ కార్యాచరణపై విస్తృతంగా చర్చించారు.

ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా టీయూడబ్ల్యూజే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు జేవి రత్నం, జిల్లా ప్రధాన కార్యదర్శి జి. రమేష్, ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి నాగచందు హాజరై మాట్లాడారు. జర్నలిస్టులందరూ ఐక్యమత్యంతో ఉంటూ తమ సమస్యలను పరిష్కరించుకోవాలని వారు పిలుపునిచ్చారు.  అనంతరం అందరి సమక్షంలో ఇల్లందు డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

జిల్లా అధ్యక్ష, కార్యదర్శుల సమక్షంలో ప్రకటించిన ఈ నూతన కమిటీ వివరాలు ఇలా ఉన్నాయి. డివిజన్ అధ్యక్షుడిగా మాదాసు నర్సి (మహా టీవీ), ప్రధాన కార్యదర్శిగా సూరం శ్రావణ్ రెడ్డి (సాక్షి), కోశాధికారిగా బి. నరేష్ కుమార్ (వెలుగు) ఉపాధ్యక్షులుగా అన్నారపు వెంకటేశ్వర్లు  (విజయక్రాంతి), ధారావతు వీరన్న ( వార్త ), రామకృష్ణ , సహాయ కార్యదర్శులుగా రాయల ప్రశాంత్, పరమ ప్రభాకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా టి. శ్రావణ్ లు ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో ఇల్లందు, గుండాల, ఆళ్లపల్లి, టేకులపల్లి మండలాలకు చెందిన సీనియర్ జర్నలిస్టులు, వివిధ పత్రికలు, ఛానళ్ల విలేకరులు తదితరులు పాల్గొన్నారు.