29 June, 2026 | 1:55 AM

భారత్ మహిళలకు సెమిస్

29-06-2026 01:01 AM

ఆసీస్ చేతిలో పరాజయం

టీ20 ప్రపంచకప్ నుంచి ఔట్

లార్డ్స్, జూన్ 28: ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్-లో భారత కథ ముగిసింది. ఆస్ట్రేలియాతో ఆదివారం తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత్ ఓటమి పాలైంది. లా ర్డ్స్ వేదకిగా టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్  హాఫ్ సెంచరీ(56)తో అదరగొట్టగా.. ఓపెనర్లు స్మృతి మంధాన (38), షఫాలీ వర్మ (34) రాణించారు. జెమీమా రోడ్రిగ్స్ 34 పరుగులు చేసింది. అయితే, ఆఖరి ఓవర్లో ఆమె రిటైర్డ్ అవుట్‌గా వెనుదిరగగా.. రిచా ఘోష్ ఆమె స్థానంలో వచ్చింది. అయితే, రిచా ఒక్క పరుగే చేయగా.. దీప్తి శర్మ నాలుగు పరుగలతో అజేయంగా నిలిచింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో కెప్టెన్ సోఫీ మోలినెక్స్ రెండు వికెట్లు దక్కించుకుంది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్‌కు ఆదిలోనే రేణుకా సింగ్ షాకిచ్చింది. ఓపెనర్ జార్జియా వోల్ (4)ను స్వల్ప స్కోరుకే వెనక్కి పంపింది. అయితే, బెత్ మూనీ (22), ఫోబీ లిచిఫీల్ (22) నిలకడగా ఆడుతూ స్కోరు బోర్డును ముందుకు నడిపారు. అయితే, ఎలిస్ పెర్రి (56), ఆష్లే గార్డ్నర్ (53 నాటౌట్) హాఫ్ సెంచరీలతో అదరగొట్టార. దీంతో 19 ఓవర్లలోనే 4 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసి ఆసీస్ జ యభేరి మోగించింది. గ్రూప్ -ఎ నుంచి సౌతాఫ్రికా సెమీస్‌లో అడుగుపెట్టింది.