29 June, 2026 | 1:06 AM

పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రారంభించిన సర్పంచ్ సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి

29-06-2026 12:00 AM

తిరుమలాయపాలెం, జూన్ 28 (విజయక్రాంతి):  తిరుమలాయపాలెం మండలం సుబ్లేడు గ్రామ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,  పాలేరు సెంటర్లో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ శ్రీమతి సంగబత్తుల స్వాతి సుమన్ రెడ్డి ప్రారంభించారు.

ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించి కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆమె, ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు సభ్యులు జి. శ్రీనివాస్, బి. రాంబాబు, హాస్పిటల్ డాక్టర్ వసుంధర, ఏఎన్‌ఎంలు సుభద్ర, మెట్టు ఉపేంద్ర, ఆశా వర్కర్లు కె. లత, ఎం. నాగేంద్ర, డి. సత్యవతి, మాజీ సర్పంచ్ భూక్యా వీరన్న, పలువురు గ్రామస్థులు పాల్గొన్నారు.