calender_icon.png 16 February, 2026 | 5:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మున్సిపల్ చైర్‌పర్సన్‌గా నీరజ్, వైస్ చైర్మన్‌గా అబ్దుల్ రజాక్ ప్రమాణం

16-02-2026 03:33:05 PM

తాండూరు,(విజయకాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ మున్సిపల్ చైర్పర్సన్ గా పట్లోళ్ల నీరజ, వైస్ చైర్ పర్సన్ గా అబ్దుల్ రజాక్ సోమవారం జరిగిన ప్రత్యేక మున్సిపల్ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్లోళ్ల నీరజ 12వ వార్డ్ సభ్యురాలుగా, అబ్దుల్ రజాక్ 29వ వార్డు సభ్యులుగా  ఎన్నికయ్యారు. చైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లకు ఎన్నికల ప్రత్యేక అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి మంగీలాల్  ప్రమాణ స్వీకారం చేయించి ధ్రువపత్రాలను అందజేశారు. చైర్ పర్సన్ గా నీరజను కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ ప్రతిపాదించగా, 22వ వార్డ్ కౌన్సిలర్ మనపురం రామకృష్ణ బలపరిచారు. వైస్ ఛైర్పసన్ గా అబ్దుల్ రజాక్ ను  వేణు గోపాల్ ప్రతిపాదించగ జుంటిపల్లి వెంకటేష్  బలపరిచారు. చైర్ పర్సన్ వైస్ చైర్మన్ లకు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్  కమిషనర్ మధుసూదన్ రెడ్డి, మేనేజర్ నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.