జాతీయ విజ్ఞాన దినోత్సవం
బెల్లంపల్లి,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో ప్రభుత్వ బాలికల కళాశాల మహనీయుల విగ్రహాల దగ్గర పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో జాతీయ సైన్స్ డే ఘనంగా జరుపుకున్నారు. అధ్యక్షులు గొడిసెల శ్రీహరి మాట్లాడుతూ.. దినదినం సైన్స్ అభివృద్ధి చెందుతు శాస్త్ర సాంకేతిక రంగంలో ఇతరదేశాలు ప్రగతి సాధిస్తుంటే మన దేశంలో మాత్రం మూఢనమ్మకాలతో వెనుకకు పోతుందని వాపోయారు. చదువు లేని వారికాంటే చదువుకున్న వారిలోనే మూఢనమ్మకాలు రోజురోజుకు పెరుగుతున్నాయన్నారు.
దీనికి కారణం విద్యాలయాల్లో శాస్త్రీయ విద్యలేకపోవడమేనని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు శాస్త్రీయ ఆలోచనాలు పెరిగే జ్ఞానన్ని అందించాలని అన్నారు.నిత్యాజీవితంలో అనుభవించేది సైన్స్ అని తెలియక పోవడమేఅన్నారు. సైన్సు నేర్చుకోవడం కష్టమే కానీ అనువార్తనాల వలెనే మనం సుఖంగా జీవిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రంగ ప్రశాంత్ ప్రధాన కార్యదర్శి రంగ ప్రశాంత్, కోశాధికారి శ్రీధర్, వర్కింగ్ ప్రసిడెంట్ గోడిసెల స్వామి, ఉపాధ్యక్షులు. దుబాసి రవి, కార్యదర్శి గొడిసెల చంద్రమౌళి, సంయుక్త కార్యదర్శి ఉండ్రాళ్ళ రవి, ప్రచార కార్యదర్శి రవిరాజు, కార్యదర్శి అక్కు కృష్ణ, ప్రచార కార్యదర్శి రసకొండ మంజుల ,ప్రసాద్ పాల్గోన్నారు.




