28 February, 2026 | 9:34 PM

ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

28-02-2026 02:59 PM

జాజిరెడ్డిగూడెం: జాజిరెడ్డిగూడెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని విద్యార్థులు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యాశాఖ మంత్రిగా జేరుపోతుల తులసి, జిల్లా కలెక్టర్ గా పాక రుషికేష్ యాదవ్, జడ్పీచైర్ పర్సన్ గా కుంభం జశ్విత, డీఈఓగా గోళ్ళ తరుణ్, ఎంపీడీఓగా వల్లాల లక్ష్మీప్రసన్న, ఎంఈఓగా బొల్లం మనోహర్, హెచ్ఎంగా రేపని వర్షితతో పాటు టీచర్లుగా, గన్ మెన్లుగా విద్యార్థులు వివిధ పాత్రల్లో అలరించారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలునాయక్, హెచ్ఎం విమలకుమారి, ఉపాధ్యాయులు సీహెచ్ వెంకటేశ్వర్లు, ఇందిర, మంజుల, సీహెచ్ నాగరాజు, యాదగిరి, ఆర్ నాగరాజు, రమేష్, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.