7 May, 2026 | 6:38 PM

సబ్ ట్రెజరీ కార్యాలయం తరలించవద్దు

07-05-2026 05:45 PM

బోథ్, మే7 (విజయ క్రాంతి): మండల కేంద్రంలో ఉన్న సబ్ ట్రెజరీ కార్యాలయాన్ని బోత్ నుండి తరలించవద్దని గ్రామ సర్పంచ్ కురుమే అన్నపూర్ణ జిల్లా కలెక్టర్ ను కోరారు. సొంత భవనం లేనందున ఇక్కడి నుండి తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె కలెక్టర్ విన్నవించారు. కార్యాలయం తరలకుండా ఇక్కడే ఉండే విధంగా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తాసిల్దార్ సుభాష్ చంద్ర ఎంపీడీవో రమేష్ ఎంపీ ఓ రాజ్ కుమార్ పంచాయతీ కార్యదర్శి అంజయ్య ఆత్మ చైర్మన్ జి రాజు యాదవ్ ఉపసర్పంచ్ విజయలక్ష్మి వార్డు సభ్యులు కట్ట భూమేష్ షేక్ షాకీర్ కదం వినయ్ కరిపే శ్రీనివాసులు పాల్గొన్నారు.