13 July, 2026 | 5:12 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ఘనంగా జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం

13-07-2026 03:43 PM

జన్నారం, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా పొనకల్ గ్రామ పంచాయతీ పరిధిలోనీ అన్ని ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నివారణ మాత్రలు పంపిణీ చేశారు. సోమ వారం పోనకల్ గ్రామ సర్పంచ్ జక్కు సుష్మ భూమేష్‌ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది సమక్షంలో పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పిల్లల ఆరోగ్య పరిరక్షణే లక్ష్యంగా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. విద్యార్థులు అనారోగ్యాల బారిన పడకుండా, చదువుపై శ్రద్ధ చూపేలా చేయడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో కీలకమని పేర్కొన్నారు. ఈ రోజు మాత్ర వేసుకున్న పిల్లలు, తిరిగి ఈ నెల 20న నిర్వహించనున్న ‘మాప్-అప్ డే’ రోజున కూడా మందు వేసుకునేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు బాధ్యత వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ జక్కు భూమేష్, వార్డు సభ్యులు మర్రిపల్లి అంజన్న, వైద్య సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.