రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు
బెల్లంపల్లి, (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో(state level athletics competitions) బెల్లంపల్లి క్రీడాకారులు పతకాలు సాధించారు. ఆదివారం హైదరాబాదులోని స్పోటోపియా స్పోర్ట్స్ అకాడమీ క్రీడామైదానంలో జరిగిన తెలంగాణ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ సబ్ జూనియర్ పోటీలలో బెల్లంపల్లి క్రీడాకారులు ఆడిచర్ల అక్షయ, అరుసం చిన్మయి చైత్రిక, ఎడ్ల త్రినయ్ ఈ పతకాలు సాధించారు. అడిచర్ల అక్షయ స్టాండింగ్ లాంగ్ జంప్ లో 1. 61 మీటర్లు దూకి బంగారు పతకం సాధించారు. అలాగే అరుసం చిన్మయి చైత్రిక 60 మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానం పొందారు. ఎడ్ల త్రినయ్ 300 మీటర్ల పరుగు పందెంలో ఐదవ స్థానంలో నిలిచాడు. వీరికి కోచ్ గా సల్పాల సంతోష్ యాదవ్ వ్యవహరించారు. విజేతలను మంచిర్యాల అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి ఈ. మారయ్య అభినందించారు.






