భూ సర్వేలు వేగవంతం చేయాలి: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్
నాగర్‌కర్నూల్ (విజయక్రాంతి): జిల్లాలో భూ సర్వే దరఖాస్తులను ఎలాంటి జాప్యం లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ లైసెన్సుడ్ సర్వేయర్లకు సూచించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న భూ భారతి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సర్వేయర్లు కీలక పాత్ర పోషించాలని అన్నారు.
ప్రతి మండలంలో భూ సర్వేలను పారదర్శకంగా, నిర్ణీత గడువులో పూర్తి చేసి ప్రజలకు సకాలంలో సేవలు అందించాలని సూచించారు. రీ-సర్వేలో పనిచేసే లైసెన్సుడ్ సర్వేయర్లకు ఎకరానికి రూ.60 (రూ.50 పారితోషికం, రూ.10 రవాణా భత్యం) చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. సర్వేల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని, రికార్డులు, సరిహద్దులు క్షుణ్ణంగా పరిశీలించి భూ వివాదాలకు తావులేకుండా పని చేయాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా సర్వేయర్ గిరిధర్, రెవెన్యూ అధికారులు, లైసెన్సుడ్ సర్వేయర్లు పాల్గొన్నారు.






