13 July, 2026 | 5:24 PM

Breaking News

రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో బెల్లంపల్లి క్రీడాకారులకు పతకాలు   •   బంజారా కమ్యూనిటీ హాల్‌కు స్థలం ఏర్పాటు చేయాలని కలెక్టర్‌కు వినతి   •   విద్యార్థుల ఆరోగ్యానికి భద్రత   •   ప్రాథమిక విద్యను మరింత బలోపేతం చేయాలి – జిల్లా కలెక్టర్ కె. హరిత   •   ఆల్బెండజోల్ మాత్రలు తీసుకోవడం ద్వారా నులిపురుగులను నివారించవచ్చు   •   విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ   •   ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి: జిల్లా కలెక్టర్ కె.హరిత   •   కాంగ్రెస్ పార్టీలో 'జక్కిడి' మంటలు   •   లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల మంజూరు పత్రలు అందజేత   •   ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ   •  

ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రల పంపిణీ

13-07-2026 04:20 PM

కోనరావుపేట జులై 13 (విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామ ప్రభుత్వ పాఠశాలలో సోమవారం విద్యార్థులకు నులిపురుగుల నివారణ మాత్రలను పంపిణీ చేశారు.విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ తిక్కల నవీన్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఉపాధ్యాయులు శ్రీనివాస్, రమాదేవి, అంగన్‌వాడీ టీచర్ బైరగొని మాధవి, ఆశా వర్కర్ తిక్కల బాబాయి, ఉమాతో కలిసి ప్రతి విద్యార్థికి నులిపురుగుల నివారణ మాత్రలు అందజేశారు.అనంతరం ఈ మాత్రల వినియోగం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, సమయానికి మందులు తీసుకోవడం వంటి అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.పిల్లల ఆరోగ్యమే సమాజ భవిష్యత్తుకు బలమైన పునాది అని పేర్కొంటూ, ప్రతి విద్యార్థి ఆరోగ్యంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.