4 August, 2026 | 2:56 AM

జిల్లా ప్రధాన కార్యదర్శిగా నాగేశ్వరరావు ఎన్నిక

04-08-2026 12:39 AM

బోధన్, ఆగస్టు 3 (విజయక్రాంతి): జిల్లా శాఖ ఎన్నికల్లో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పెంటాకలాన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. నాగేశ్వరరావు, బోధన్ డివిజన్ కన్వీనర్గా ఎన్నికైన సందీప్లను సోమవారం బోధన్లో నిర్వహించిన ప్రధానోపాధ్యాయుల సమావేశంలో ఘనంగా సన్మానించారు.

బోధన్ మండల విద్యాధికారి నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పి.ఎస్.హెచ్‌ఎం అధ్యక్షుడు గంట గంగాధర్, జిల్లా కన్వీనర్ సందీప్తో పాటు ప్రధానోపాధ్యాయులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ... జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన పి. నాగేశ్వరరావు ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారంతో పాటు ప్రభుత్వ విద్యాభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో హనుమంతు, సాయిలు, విజయలక్ష్మి, ఇందిరా దేవి, సత్తుబాయి ,సిఆర్పి విజయ్ తదితర ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.