17-02-2026 01:26:55 AM
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్
చెన్నై, ఫిబ్రవరి 16: ‘టీవీకే అధ్యక్షుడు, తమిళ సినీ స్టార్ విజయ్‌కి రాజకీయాలపై ఏమాత్రం అవగాహ న లేదు. ఆయనకున్న అనుభవం సున్నా. రాజకీయాల్లో ఏదైనా సాధించాలనుకుంటే ముందు విజయ్ తన ఇల్లు దాటి బయటకు రావాలి. అంతకంటే ముందుగా నటి త్రిష ఇంటి నుంచి బయటకు రావాలి. ఆ పని చేస్తేనే విజయ్‌కి వాస్తవాలు తెలుస్తా యి’ అని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలు రాజకీయంగా రాష్ట్రంలో పెద్ద దుమారం రేపాయి. వ్యాఖ్యలపై తమిళ చిత్ర పరిశ్రమ నుంచి, మహి ళా సంఘాల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడై ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని తమిళ సమాజం దుమ్మెత్తి పోసింది. దీంతో నైనార్ నాగేంద్రన్ సోమవారం నటి త్రిషకు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని ప్రకటించారు. తన వ్యాఖ్యల ను ఎవరి మనసునైనా బాధపెట్టి ఉంటే తనను క్షమించాలని కోరారు. తన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేసినవి కావని ఆయన స్పష్టం చేశారు.