17-02-2026 01:28:20 AM
చెన్నై, ఫిబ్రవరి 16: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్ తనపై చేసిన వ్యాఖ్యలపై నటి త్రిష ఘాటుగా స్పందించారు. తన న్యాయవాది ద్వారా సోషల్‌మీడియాలో ప్రకటన విడుదల చేశారు. ‘వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా, ఎదుటివారిని అగౌరవపరిచే విధంగా నాగేంద్రన్ వ్యాఖ్యలు చేశారు.
రాజకీయాల్లో ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత దిగజారుడు వ్యాఖ్యలు చేస్తారని ఊహించలేదు. నాకు ఏ రాజకీయ పార్టీతోనూ సంబంధం లేదు. దయచేసి నన్ను అనవసర వివాదాల్లోకి లాగొద్దు. లాగితే చట్టపరమైన చర్యలకు వెనుకాడను’ అని హెచ్చరించారు.