21 July, 2026 | 7:15 AM

చిన్నకల్వల సింగిల్ విండో చైర్మన్ గా మురళీధర్ రావు బాధ్యతల స్వీకరణ

20-07-2026 05:07 PM

సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల సహకార సంఘం (సింగిల్ విండో)  చైర్మన్ గా గౌరవెల్లి మురళీధర్ రావు, పాలకవర్గ సభ్యులతో కలసి సోమవారం బాధ్యతలు స్వీకరించారు, ఈ సందర్భం గా రైతులకు మెరిగైన సేవలు అందించేందుకు కృషి చేస్తానని నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మురళీధర్ రావు తెలిపారు, చైర్మన్, పాలకవర్గ సభ్యులకు సిబ్బంది , రైతులు శుభాకాంక్షలు తెలిపారు, ఈ కార్యక్రమం లో సర్పంచులు ఏరుకొండ స్రవంతి, మ్యాకల పోచాలు, అట్ల కుమార్, అబ్బోజు కవిత, సీఈఓ వల్ల కొండ రమేష్ , సిబ్బంది, రైతులు  పాల్గొన్నారు.