తెలంగాణ రక్షణ సమితిలో చేరిన మండల యువకులు
20-07-2026 05:14 PM
బోథ్,(విజయక్రాంతి): మండలంలోని కంటిగాం నిగ్ని సునాల గ్రామాలకు చెందిన దాదాపు 20 మంది యువకులు సోమవారం తెలంగాణ రక్షణ సేన పార్టీలో చేరడం జరిగింది నియోజకవర్గ ఇన్చార్జి మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాబూరావు పార్టీలో చేరిన యువకులను సాదరంగా ఆహ్వానించి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. భవిష్యత్తు తెలంగాణ రక్షణ సేన పార్టీ ఇదేనన్నారు రానున్న రోజుల్లో మరి కొంతమంది యువకులు పార్టీలో చేరుతారని పేర్కొన్నారు కార్యక్రమంలో రమేష్ ,శ్రీను, సంతోష్, రాకేష్ ,అశోక్, సాయన్న, రమణ విష్ణు ,తదితరులు ఉన్నారు






