27 June, 2026 | 1:34 AM

బీజేపీలో చేరిన స్కేర్ బిజినెస్ సర్వీసెస్ ఎండీ

27-06-2026 12:29 AM

కాషాయ కండువా కప్పుకున్న 120 మంది సహచరులు

హైదరాబాద్, జూన్ 26 (విజయక్రాంతి): స్క్వేర్ బిజినెస్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ తన 120 మంది సహచరులు, అసోసియేట్స్‌తో కలిసి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బీజేపీ తెలంగాణ చీఫ్ స్పోక్స్‌పర్సన్ ఎన్వీ సుభాష్ సమక్షంలో పార్టీలో చేరారు. రాంచందర్‌రావు మాట్లాడుతూ.. ‘ఇలాంటి డైనమిక్ బిజినెస్ లీడర్, ఆ యన టీమ్ మా పార్టీలో చేరడం ఆనందంగా ఉంది. వారి అనుభవం, ఉత్సాహం రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి, మంచి పరిపాలన కోసం మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయి’ అని అన్నారు.

ఎన్వీ సుభాష్ మా ట్లాడుతూ.. ‘ప్రజాసేవకు కట్టుబడి ఉన్న ప్రొ ఫెషనల్స్‌కు బీజేపీ ప్రధాన ఎంపికగా కొనసాగుతోందనడానికి ఇది స్పష్టమైన సంకే తం’ అన్నారు. కార్యక్రమం అనంతరం స్క్వేర్ బిజినెస్ సర్వీసెస్ ఎండీ, సీఈఓ మాట్లాడు తూ.. ‘సమగ్ర అభివృద్ధి, పారదర్శక పరిపాలనపై బీజేపీకి ఉన్న విజన్‌పై నమ్మకంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. నా 120 మంది సహచరులతో కలిసి మా సమాజ సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తాను’ అని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ మల్క కొమరయ్య, అభిషేక్, అధికార ప్రతినిధి గీతా మూర్తి, నేషనల్ కౌన్సిల్ మెంబర్ కప్పర ప్రసాద్ పాల్గొన్నారు.