7 March, 2026 | 11:27 PM

ఉపాధి పనులను పరిశీలించిన ఎంపీడీఓ

07-03-2026 09:34 PM

టేకులపల్లి,(విజయక్రాంతి): టేకులపల్లి మండలం బద్దు తండ గ్రామపంచాయతీలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న రోడ్డు నిర్మాణ పనులను మండల పరిషత్ అభివృద్ధి అధికారి బైరు మల్లేశ్వరి శనివారం పరిశీలించారు. పని వద్ద 87 మంది వేతన దారులు పనిచేయడం జరుగుతుందన్నారు. ఉపాధి హామీ కూలీలతో మాట్లాడుతూ.. నూతనంగా ప్రభుత్వం ద్వారా అమలు చేయబడుతున్న ఫేస్ అతంటికేషన్ యాప్ అమలులో  సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు.

ప్రతిరోజు పని వద్దకు కూలీలు మంచి నీరు, భోజనం తెచ్చుకుని ప్రభుత్వం నిర్దేశించిన పనిని రూ.307/-లను పూర్తి చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకంలో పశువుల కొరకు మేకల పెంపకం కొరకు నూతనంగా షెడ్లు మంజూరు చేయబడతాయని వారికి అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. అందరూ వంద రోజులు పూర్తి చేయాలని కోరారు.  ఈ ఆవాసం లో వున్న ప్రభుత్వ పాఠశాలను, అక్కడ ఉన్న మరుగుదొడ్లను పరిశీలించారు. వసతులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవోతో పాటు అదనపు కార్యక్రమ అధికారి కాళంగి శ్రీనివాస్,  క్షేత్ర సహాయకులు దరావత్ తులసీరాం పాల్గొన్నారు.