30 July, 2026 | 2:03 AM

ఎల్లమ్మబండలో వానరం హల్‌చల్

30-07-2026 01:26 AM

కూకట్ పల్లి, జులై 30,( విజయ క్రాంతి ):కూకట్ పల్లి జోన్ ఆల్విన్ కాలనీ సర్కిల్ ఎల్లమ్మబండ కమ్యూనిటీ హాల్ లో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ ప్రక్రియ కార్యక్రమంలో కోతి హల్చల్ చేసిన సంఘటన బుధవారం జరిగింది. కమ్యూనిటీ హాల్ లో  బిఎల్ ఓ లు ఏర్పాటు చేసుకున్న టేబుల్ లపై ఎక్కడి నుంచో వచ్చిన ఓ కోతి ( వానరం ) టేబుల్ పై ఉన్న ఎస్ ఐ ఆర్ ఫామ్ లను, ఓ బ్యాగును తెరిచి చూడడంతో అక్కడ ఉన్న స్థానికులు కోతి కూడా తన ఓటు ఉందా అంటూ తనకి చేసుకోవడానికి వచ్చిందా అంటూ అవాక్కయ్యారు.

కోతి టేబుల్ పై అటు ఇటు తిరుగుతూ ఉండడంతో బిఎల్ ఓ లు, ఓటర్ మ్యాపింగ్ కోసం వచ్చిన స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.అక్కడ ఉన్న స్థానికులు ఆ వానరానికి ఆహారాన్ని ఇచ్చి వెటర్నరీ డిపార్ట్మెంట్ కు సమాచారాన్ని అందించారు. గత కొంతకాలంగా ఎల్లమ్మబండ సమీప కాలనీలలో వానరాలు అధికంగా తిరుగుతున్నాయని వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.