26 June, 2026 | 2:26 AM

బాసరలో (ట్రా)ఫికర్

26-06-2026 01:17 AM

ప్రధాన మార్గాల్లో ఆక్రమణలు 

నిలువ నీడలేని బస్టాండ్ 

నిర్మల్ జూన్ 25 (విజయక్రాంతి): దక్షిణ భారతదేశంలోని ఏకైక సరస్వతి నిల యమైన శ్రీ జ్ఞాన సరస్వతి బాసర అమ్మవారి ఆలయంలో భక్తులకు (ట్రా) ఫికర్ నెల కొంది. బాసర ఆలయం భక్తులు వెళ్లే మా ర్గాల్లో వ్యాపార దుకాణాలు రోడ్లపైకి వచ్చి ఏర్పాటు చేయడంతో సమస్య ఉత్పన్నమవుతుంది.

ప్రతినిత్యం వేలాది భక్తులతో కిటకిట లాడే బాసర ట్రాఫిక్ నియంత్రణ లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవు తున్నారు. వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ నిబంధనలను ఏర్పాటు చేస్తున్న అధికారులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు.

సరస్వతి కొలువైన బాసరకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు కేరళ తదితర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తు లు తరలివచ్చి తమ పిల్లలకు అక్షరాభ్యాసం చేయించుకుంటారు. సుదూర ప్రాంతాల వా రు ప్రైవేట్ వాహనాలు రైళ్లలో ఇక్కడికి వ స్తుంటారు. బాసర అమ్మవారి ఆలయం పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య ఉత్పన్న మవుతుంది. వాహనాలను రోడ్లపై నిలిపివేస్తున్నారు దీంతో భక్తులకు లోనికి వెళ్లాలం టేనే  ఇరుకుగా ఇబ్బందితో అమ్మవారి దర్శ నం చేసుకుంటున్నారు 

అసలు ఇరుకు ఆపై ఆక్రమణలు 

బాసర అమ్మవారి ఆలయంలో అసలు ఇరుకు ప్రధాన మార్గాలు ఉండగ వ్యాపార దుకాణదారులు రోడ్డుపైకి వచ్చి వ్యాపారం చే స్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అన్నదాన సత్రం నుండి మెయిన్ రోడ్ వరకు దుకాణాలు బాసర అమ్మవారికి వెళ్లే ప్రధాన మార్గాల్లో టెండర్ దక్కించుకున్న దుకాణం దారులు వారికి కేటాయించిన స్థలం కంటే ఎక్కువగా ఆక్రమించుకొని వ్యాపారం చేస్తున్నారు.

దీంతో ఆ మార్గాల్లో ఇరుకుగా ఏర్ప డి భక్తులు లోనికి వెళ్లేందుకు నానా అవస్థలు పడుతున్నారు. బాసర ప్రధాన ఆలయం తూర్పు, ఉత్తరం దిశల్లో ఉన్న వ్యాపార దుకాణాలు ముందుగా ఉన్న ఖాళీ స్థలాన్ని ఆక్రమించుకొని దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. చేస్తున్నారు. దీంతో ఉన్న స్థలం ఇరుకుగా ఏర్పడి వచ్చిపోయే భక్తులకు ఇబ్బందిగా మారింది ముఖ్యంగా వృద్ధులు గర్భిణీలు చిన్నపిల్లలు ట్రాఫిక్ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.

దీనికి తోడుఇక్కడికి వచ్చే భక్తులు బాసర టెంపుల్ బస్టాండ్ వద్ద దిగి అమ్మవారి దర్శనానికి గోదావరి స్థానానికి. ప్రైవేటు ప్రభుత్వము వసతి సముదాయలకు వెళుతుంటారు.  వారిని తీసుకెళ్ళు ఎందుకు ప్రవేటు ఆటోలు టాటా మ్యాజిక్ లు రోడ్డుపై నిలిపి ఫ్రాక్ సమస్య సృష్టిస్తున్నారు.

బైంసా నుండి నిజాంబాద్ వెళ్లే టీజీ ఆర్టీసీ బస్సులన్నీ బాసర టెంపుల్ మార్గం ద్వారా వెళ్తాయి. ప్రైవేటు వానలు ఆర్టీసీ బస్సులు జనం రద్దీ ట్రాఫిక్ సమస్య మరింత ఆజ్యం పూస్తుంది. రోడ్లపై వ్యాపార చేసే వారు కూడా తమ వాహనాలను ఇక్కడే నిలుపుతున్నారు. దీంతో బాసర ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య తిక్కన్నమవుతుంది. ప్రాథమిక సమస్యపై జిల్లా అధికారులకు ఎన్నోసార్లు ఫిర్యాదు చేసిన ఎవరూ పట్టించుకోవడంలేదని బాసర చెందిన కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

వీఐపీలు వచ్చినప్పుడు మాత్రమే ట్రాఫిక్ సమస్యను నియంత్రిస్తున్న పోలీసులు ఆ తర్వాత పట్టించుకోకపోవడంపై రద్దీ ఏర్పడి ప్రమాదాలు జరగడం దొంగతనాలు జరగడం జరుగుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాసర ప్రధాన ఆలయంలోపల కూడా భక్తులు దర్శనం అనంతరం అక్కడే ఉండడం వల్ల భక్తులకు ఇబ్బంది తప్పడం లేదు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పోలీసు ఆలయ భద్రత అధికారులు కొన్ని చర్యలు తీసుకుంటున్న అవి తాత్కాలికంగా మాత్రమే ప్రజలకు ఉపయోగపడుతున్నాయని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

బాసరకు వచ్చి భక్తులు ఎలాంటి బస్సు స్టాండ్ లేకపోవడంతో దుకాణాల ముందర రోడ్లపై నిలబడటం వల్ల దుకాణం దారులు భక్తులను వెళ్లగొట్టడంతో గొడవలు అవుతున్నాయి. రోలపై భక్తులు నిలబడి బస్సుల కోసం చిన్నపాపలతో నిరీక్షిస్తున్నారు ఇప్పటికైనా జిల్లా అధికారులు వెంటనే స్పందించి బాసరలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని అక్రమాలు తొలగించాలని భక్తులు కోరుతున్నారు.