26 June, 2026 | 2:29 AM

చింతకాని పీహెచ్‌సీలో డీఎంఅండ్‌హెచ్‌ఓ డా.రామారావు ఆకస్మిక తనిఖీ

26-06-2026 01:14 AM

జూన్ 25,(చింతకాని) (విజయ క్రాంతి): చింతకాని : ఖమ్మం జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్వో) డా. రామారావు గురువారం చింతకాని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 28, 29, 30 తేదీల్లో నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమం సన్నాహాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పల్స్ పోలియో కార్యక్రమానికి అవసరమైన వ్యాక్సిన్ నిల్వలు, కోల్ చైన్ నిర్వహణ, పోలియో బూత్ల ఏర్పాటు, సిబ్బంది నియామకం, అవగాహన కార్యక్రమాల అమలు తదితర అంశాలను సమీక్షించారు. లక్ష్యంగా ఉన్న ప్రతి చిన్నారికి పోలియో చుక్కలు అందేలా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని సిబ్బందికి సూచించారు.

అనంతరం ఆసుపత్రిలోని వివిధ విభాగాలు, రికార్డులు, ఔషధ నిల్వలు, పరిశుభ్రత పరిస్థితులు మరియు రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతో పాటు ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. ఈ తనిఖీలో వైద్యాధికారులు డా. ఎం.డి. అల్తాఫ్, డా. ఎం. శ్రీదేవి, డా. సోహైల్, సూపర్వైజర్లు ఇస్మాయిల్, కనకతార, యూడీసీ పల్లవ ి, ఫార్మసిస్టులు సిరాజ్, శ్రీనివాసు, స్టాఫ్ నర్స్ అరుణతో పాటు పీహెచ్సీ సిబ్బంది పాల్గొన్నారు.