ప్రతి ఓటును కాపాడుకోవాలి
ములకలపల్లి,జూన్ 25 (విజయక్రాంతి): ప్రతి ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలపై ఉందని భద్రాద్రి జిల్లా కాంగ్రెస్ నాయకులు, మాజీ జెడ్పిటిసి సభ్యులు బత్తుల అంజి పార్టీ కార్యకర్తలకు సూచించారు.గురువారం ములకలపల్లి మండలం జగన్నాధపురం,పొగళ్లపల్లి గ్రామపంచాయతీలలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియలో వారు పాల్గొని కార్యకర్తలకు సలహాలు సూచనలు అందజేశారు.
ములకలపల్లి మండలంలో ఉన్న 34 బూతులలో ఉన్న బిఎల్‌ఎ లు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతి ఒక్క ఓటు కాపాడుకోవాలని 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కోసం దరఖాస్తు చేయించాలని చెప్పారు. జగన్నాధపురం,పొగళ్లపల్లి సర్పంచులు కుంజా వినోద్, మడకం రవి ఎన్యుమరేషన్ ఫారాలు బి ఎల్ ఓ కి కి అందజేశారు. ఈ కార్యక్రమంలో ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యండి జహీరుద్దీన్, జిల్లా కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పాలకుర్తి రత్న భూషణం,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






