18 April, 2026 | 6:23 PM

ఉపాధి హామీ చట్టాన్ని ఊరేస్తున్న మోడీ ప్రభుత్వం

18-04-2026 05:00 PM

 సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి- జాజిరి శ్రీనివాస్

సత్తుపల్లి,(విజయక్రాంతి): మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టానికి మోడీ ప్రభుత్వం ఉరేస్తూ కార్మికుల పట్టబడుతుందని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం సత్తుపల్లి డివిజన్ కార్యదర్శి జాజిరి శ్రీనివాస్ విమర్శించారు. శనివారం మండల పరిధిలోని సిద్ధారం, గౌరి గూడెం గ్రామాలలో ఉపాధి హామీ ప్రదేశాలను సందర్శించి కార్మికులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ... గ్రామీణ పేదల జీవన పరిస్థితుల్లో మార్పు తెచ్చి రెండు పూటలా తిండి పెడుతున్న ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కూలీలు తింటున్న కంచాన్ని గుంజుకున్నట్టు మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు.

ఈకేవైసీ విధానం తేవడం వల్ల పని ప్రదేశంలో నెట్ సరిగా లేక కూలీల ఫోటోలు రాక నాన్న తిప్పలు పడుతున్నారని తెలిపారు. ఈ కే వైసీలో ఫోటో రాకపోతే ఆరోజు కూలికి తీసుకునే పరిస్థితి లేదని ఆవేదన వెలిబుచ్చారు. గ్రామీణ ఉపాధి హామీ పనులలో రెండుసార్లు ఫోటోలు తీసే విధానాన్ని రద్దు చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వీబీజీ రాంజీ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల, ఫీల్డ్ అసిస్టెంట్ల మూడు నెలల వేతనాలను చెల్లించాలన్నారు.

ఈనెల 20వ తేదీన సత్తుపల్లి తహసిల్దార్ కార్యాలయం వద్ద జరిగే ధర్నా కార్యక్రమంలో కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వ్యకాస మండల కార్యదర్శి కు వ్వారపు లక్ష్మణరావు, ప్రజా నాట్య మండలి డివిజన్ కార్యదర్శి అయినంపూడి సరందరావు, మంచాల వెంకటేశ్వరరావు, కొలిక పోగు కృష్ణ, జగపతిరావు, శిరోమణి, సిరికొండ నాగేశ్వరరావు, కాకటి యశోద, గద్దల దుర్గ, దాట్ల రాధమ్మ, గద్దల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.