calender_icon.png 19 February, 2026 | 10:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబడ్డీ క్రీడాకారిణికి ఆధునిక వైద్యం

19-02-2026 02:47:57 AM

కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్‌లో రామావత్ నందినికి సత్కారం

సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో క్రీడాకారులకు ఆధునిక వైద్యసేవలు: డాక్టర్ ఏవీ గురవారెడ్డి

హైదరాబాద్, ఫిబ్రవరి 18(విజయక్రాంతి): మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తున్నారని, క్రీడల్లో గాయాలపాలైన వారు తమ కేరియర్ ఇక ఆగిపోతుంది ఆనుకోకుండా వారికి సరైన వైద్యసేవలు అందించి ముందడుగు వేసేలా సన్ షైన్ బోన్ అండ్ జాయింట్ ఇనిస్టిట్యూట్ ఆధ్వర్యంలో డాక్టర్ల బృందం కృషిచేస్తోందని డాక్టర్ ఏవీ గురవారెడ్డి తెలిపారు.

తీవ్రమైన మోకాలి గాయలకు గురైన ప్రముఖ కబడ్డీ క్రీడాకారిణి రామావత్ నందినికి కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్స్ షోల్డర్ అండ్ స్పోరట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ చంద్రశేఖర్ నేతృత్వంలో  వైద్య సేవలు అం దించారు. దీంతో రామావత్ నందిని పూర్తిగా కొలుకొని తిరిగి జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బుధవారం బేగంపేటలోని కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్‌లో నందినిని ఘనంగా సన్మానించారు. 2022లో నందిని కుడి మోకాలిలో ఏసీఎల్ లిగమెంట్ గాయం కావడంతో పోటీ క్రీడలకు దూరమయ్యారు.

ప్రత్యేక వైద్యం కోసం కిమ్స్ సన్ షైన్ హాస్పిటల్ షోల్డర్ అండ్ స్పోరట్స్ సర్జరీ డైరెక్టర్ డాక్టర్ బి. చంద్రశేఖర్‌ను సంప్రదించారు. ఏసీఎల్ రీకన్ స్ట్రక్షన్ శస్త్రచికిత్స ఆనంతరం కొన్ని నెలల్లోనే మళ్లీ మైదానంలోకి వచ్చి పోటీలను ప్రారంభించారు. 2024లో ఆదే మోకాలికి మళ్లీ గాయ మైంది. ఈ సారి మెనిస్కస్ దెబ్బతింది.డాక్టర్ చంద్రశేఖర్ నేతృ త్వంలో డాక్టర్ల బృందం సమయోచిత శస్త్రచికిత్స, రీహ్యాబిలిటేషన్ అందించడం ద్వారా గాయం పూర్తిగా నయమై మూడు నెలల్లోనే తిరిగి క్రీడల్లో ఆడుగు పెట్టారు.

నందిని ఇప్పుడు తెలంగాణ తరపున 72వ సీనియర్ నేషనల్ ఉమెన్స్ కబడ్డీ చాంపియన్‌షిప్‌లో పాల్గొనడానికి ఎంపికైనట్లు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. డాక్టర్ గురవారెడ్డి మా ట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా క్రీడాకారులకు గాయాల నివారణ, ఆధునిక స్పోర్స్ మెడిసిన్ రీహ్యాబిలిటేషన్ పై ఆవగాహన కల్పించడంతో పాటు సరైన నిపుణుల పర్యవేక్షణలో వైద్యం అందిస్తే కేరీర్ కు ముగింపు కాదనే విషయం తెలుసుకోవాలన్నారు.

(మాజీ భారత కబడ్డీ క్రీడా కారుడు), డీఎస్పీ వేణుగోపాల్, తెలంగాణ బాస్కెట్‌బాల్ ఆసోసియేషన్ జనరల్ సెక్రటరి పృధ్వీశ్వర్ రెడ్డి, సీఎస్‌ఎస్ హెచ్ క్లినికల్ హెడ్ డాక్టర్ సుమన్ తడగొండ, హైదరాబాద్ క్రికెట్ అకాడమి, రంజీ టీం సీనియర్ ఫిజియోథెరఫిస్ట్ డాక్టర్ రాజేష్, సెంటర్ ఫర్ స్పున్ ఆండ్ స్పోరట్స్ హెల్త్ ఫౌండర్ సీఈఓ, పుల్లెల గోపీచంద్ ఆకాడమి నరేష్ కుమార్ తదితరులు వారి ఆనుభవాలను పంచుకున్నారు.కిమ్స్ సన్‌షైన్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ కుషాల్, డాక్టర్ ఆదర్శ్ ఆన్నపరెడ్డి తదితరుల నేతృత్వంలో నందినిని ఘనంగా సన్మానించారు.