29 July, 2026 | 9:40 PM

Breaking News

మంథని మాజీ ఉపసర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   తెలంగాణ జలసిరిపై ప్రజలకు అవగాహన కల్పించిన పెద్దకాపర్తి సర్పంచ్   •   నల్లబండగూడెం సాయిమందిరంలో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు   •   గురుపౌర్ణమి సందర్భంగా సామూహిక ధ్యానం   •   ఆర్మూర్ ఎంఈవోగా రాజేశ్వర్   •   ఏజెన్సీలో భారీ వర్షాలు.. గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్   •   భిక్కనూర్ పీహెచ్‌సీలో వైద్య సేవలపై డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ   •   సువర్ణ వనమాల దశదిన కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   రోటర్ డామ్ ఇంటర్నేషనల్ స్కూల్ కు ప్రతిష్టాత్మక ఆర్ఐడిఎస్ అంతర్జాతీయ అవార్డు   •   ఎర్రుపాలెం మండలంలో ఘనంగా గురు పౌర్ణమి వేడుకలు   •  

బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలి

30-05-2026 09:26 PM

- కలెక్టరేట్ లో మాక్ పార్లమెంట్

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): మహిళా వారోత్సవాల ముగింపు సందర్భంగా శనివారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన స్నేహ కిషోర బాలికల మాక్ పార్లమెంట్ కార్యక్రమం ఆకట్టుకుంది. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ మాట్లాడుతూ బాలికల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందాలని, సామాజిక సమస్యల పరిష్కారంలో ముందుండాలని సూచించారు. మాక్ పార్లమెంట్‌లో బాలికలు రాష్ట్రపతి, స్పీకర్, ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకురాలు వంటి పాత్రలు పోషిస్తూ ప్రజాస్వామ్య విధానాలపై అవగాహన ప్రదర్శించారు.

బాలికలు ధైర్యంగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేయడం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. దూర ప్రాంతాలకు వెళ్లే విద్యార్థినులకు రవాణా ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో కిషోర బాలికలకు సైకిళ్లు పంపిణీ చేయనున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అమరేందర్, అదనపు ఎస్పీ వెంకటేశ్వర్లు, డీఆర్‌డీఏ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.