రైతులకు చట్టబద్ధమైన మద్దతు ధర కల్పించాలని డిమాండ్
- మునుగోడులో జీవో ప్రతుల దహనం
మునుగోడు,(విజయక్రాంతి): రైతులు పండించిన పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం జిల్లా కార్యదర్శి గురజా రామచంద్రం అన్నారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వామపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో రైతు సమస్యలపై నిరసన కార్యక్రమం నిర్వహించి రైతు వ్యతిరేక జీవో ప్రతులను దహనం చేశారు. సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) పిలుపు మేరకు దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. పార్లమెంటులో రైతులు పండించే ప్రతి పంటకు చట్టబద్ధమైన మద్దతు ధరను అమలు చేయాలని, అలాగే రైతు సంక్షేమానికి సంబంధించిన స్వామినాథన్ కమిటీ సిఫారసులను పూర్తిస్థాయిలో అమలు చేయాలని డిమాండ్ చేశారు.






