21 July, 2026 | 6:50 AM

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతోనే బస్తీ దవాఖానలు

20-07-2026 03:17 PM

ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే  విజయరమణ రావు

సుల్తానాబాద్,(విజయక్రాంతి): రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతోనే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గాను పల్లె దవఖానలు, బస్తీ దవాఖాన లు ఏర్పాటు చేస్తుందని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. సోమవారం పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఏడవ వార్డులో రూ.20 లక్షలతో  నూతన బస్తీ దవాఖాన నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి విజయ రమణారావు శంకుస్థాపన చేశారు.

ముందుగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే విజయరమణ రావుని స్థానిక వార్డు కౌన్సిలర్ ఉట్ల పర ప్రదీప్ ప్రజాప్రతినిధులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా  విజయరమణ రావు  మాట్లాడుతూ... ప్రజలందరికీ వైద్య సేవలు అందించాలనే గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  పల్లె దవఖానలు, బస్తీ దవాఖానలకు ప్రభుత్వ వైద్యశాలలో మెరుగైన చికిత్సలు అందిస్తూ ముందుకు పోతున్నారని అందులో భాగంగానే ఏడవ వార్డులో 20 లక్షల రూపాయలతో బస్తీ దవాఖాన నిర్మాణం చేపడుతున్నట్లు తెలిపారు.