21 July, 2026 | 6:50 AM

చిట్యాలలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఘన స్వాగతం

20-07-2026 03:20 PM

చిట్యాల,(విజయక్రాంతి): నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన సమీక్ష సమావేశానికి వెళ్తున్న తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి  ఉత్తమ్ కుమార్ రెడ్డి కి చిట్యాలలో నకిరేకల్ శాసనసభ్యుడు, ప్రభుత్వ విప్వేముల వీరేశం ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం (బోకే) అందజేసి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి పోకల దేవదాస్ పాల్గొని మంత్రి కి స్వాగతం పలికారు.