వర్షాకాలం వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
* ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మికంగా పర్యటించిన ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్
ఉట్నూర్,(విజయక్రాంతి): వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. శుక్రవారం సాయంకాలం ఉట్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి ఆకస్మికంగా పరిశీలించారు. ఎమ్మెల్యే పేషెంట్ వార్డ్స్ లో తిరుగుతూ రోగుల సమస్యలు తెలుసుకున్నారు. వాన కాలంలో వైరల్ ఇన్ఫెక్షన్స్ తో జ్వరాలు బారిన పడకుండా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వర్షాకాలం వచ్చే వ్యాధుల కు సరిపడ మందులను నిలువ ఉంచుకోవాలని సూచనలు చేశారు. ముఖ్యంగా వైరల్ జ్వరాలు, డయేరియా రోగులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని అందుకు అనుగుణంగా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండి వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి సూచనలు చేశారు.






