ఎమ్మెల్యే తలసాని ప్రత్యేక పూజలు
13-05-2026 12:25 AM
సనత్‌నగర్, మే 12 (విజయక్రాంతి):- హనుమాన్‌జయంతిని పురస్కరించుకుని మాజీమంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పూజలు నిర్వహించారు. మంగళవారం అమీర్‌పేటలోని కుమ్మరిబస్తీలో గల హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు. ముందుగా ఆలయ పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయ పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఎమ్మెల్యే వెంట మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, నాయకులు ప్రవీణ్‌రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు గుడిగే సత్యనారాయణ యాదవ్, నాయకులు టిల్లు బాయ్, ప్రదీప్, వేణుగౌడ్, కూతురు నర్సింహ, లక్ష్మణ్, నరేష్, శేఖర్ గౌడ్, నాగలక్ష్మి, రాణికౌర్ తదితరులు ఉన్నారు.






