13 May, 2026 | 1:34 AM

వరి,మొక్కజొన్న ధాన్యం కొనుగోళ్లు వేగంగా నిర్వహించాలి

13-05-2026 12:25 AM

అదనపు కలెక్టర్ మధుమోహన్

గద్వాల మే12 రైతులకు ఇబ్బందులు లేకుండా వరి,మొక్కజొన్న ధాన్యం కొనుగో ళ్లు వేగంగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ మధుమోహన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లతో ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష నిర్వహించారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం ఐడీఓసీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో మాట్లాడి న అదనపు కలెక్టర్ మధుమోహన్ కేంద్రాల్లో గన్ని సంచులు, రవాణా, హమాలీల సమస్యలు లేకుండా చూడాలని సూచించారు. లారీల కొరత రాకుండా చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే ప్రైవేట్ గోదా ములు, రైతు వేదికలను వినియోగించాలని తెలిపారు.అకాల వర్షాల నేపథ్యంలో ధా న్యం తడవకుండా టార్పాలిన్లు సిద్ధంగా ఉంచాలని సూచించారు.