20 August, 2026 | 1:54 AM

కష్టానికి తగ్గ ఫలితం లేదు..

20-08-2026 12:00 AM
  1. బీఎల్‌ఓల బిల్లులు రాలేదు
  2. ఎస్‌ఐఆర్ ప్రక్రియలో రాత్రింబవళ్లు పని చేసినా అందని వేతనాలు
  3.   417 మంది.. రూ.39 లక్షల బకాయి
  4. అధికారులు ఉన్న వాట్సప్ గ్రూప్‌లో శాపనార్థాలు పెడుతున్న బీఎల్‌ఓలు

కూకట్‌పల్లి, ఆగస్టు 19 (వికాయక్రాంతి): మన ఉసురు తప్పక తగులుతుంది... బంగా రు తెలంగాణాలో బెదిరించి పని చేయించుకుంటున్నరు... పనులు చేయించుకునే ముం దు ప్రభుత్వం నిధులు సమకూర్చుకుని ప నులు చేయించాలి... గత రెండు నెలలుగా రాత్రి, పగలు, ఎండ, వాన అన్న తేడా లే కుండ ఇంటింటికి తిరిగి ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పాల్గొన్న బిఎల్‌ఓలు తమ బాధలు, ఆక్రోశాన్ని ఏకంగా అధికారులు ఉన్న గ్రూపులోనే మేసేజ్‌లు పెడుతున్నారు.

కేంద్ర ఎన్నికల సంఘం చే పట్టిన ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇం టింటికి తిరిగి ఎన్యుమరేషన్ ఫా రాలు పంపిణి, నింపిన ఫారాలు డిజిటలైజ్ చేయడం, ఓటర్ల సమస్యలకు పరిష్కరించ డం కోసం ఎన్నికల కమిషన్ బిఎల్‌ఓలను నియమించుకుని గత రెండు నెలలుగా వారి తో పనులు చేయించుకుంది.

ఎస్‌ఐఆర్ ప్రక్రియలో పాల్గొనే బిఎల్‌ఓలకు 8 నుంచి 9 వే ల వరకు వేతం అందిస్తామని చెప్పిన అధికారులు ఎస్‌ఐఆర్ ప్రక్రియ ముగిసిన ఇప్ప టి వరకు వేతనలు చెల్లంచడం లేదు దీంతో బిఎల్‌ఓలు తమకు రావలసిన డబ్బుల కో సం అధికారుల చుట్టు తిరుగుతునారు. 

అధికారులు, ప్రభుత్వానికి శాపనార్ధాలు:

ఎస్‌ఐఆర్ విధులలో పాల్గొంటున్న బిఎల్‌ఓలు, సూపర్‌వైజర్‌లతో పాటు ఏఈఆర్ ఓలుగా వ్యవహరిస్తున్న అధికారులతో ఓ వాట్సప్ గ్రూప్ నిర్వహిస్తున్నారు. గత కొన్ని రోజులుగా తమకు రావలసిన బిల్లులు రాక వాట్పప్ వేదిక అధికారులు, ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారు. డబ్బులు అడిగితే సాకులు చెబుతున్నారు మా ఉసురు తప్పక తగులుందని ఓ బిఎల్‌ఓ మెసేజ్ చేయగా, మరొకరు బంగారు తెలంగాణలో బెదిరించి పనులు చేయించుకుంటున్నారని ఒకరు, ఏదైన పని స్టార్ట్ చేసేటప్పుడు అవసరమైన నిధులు సమకూర్చుకుని పనులు ప్రారంభించాలని మరొకరు మెసేజ్ చేశారు.

సుమారు 500 మంది విధులలో ఉన్నారు:

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ ప్రక్రియలో జోనల్ కమిషనర్ ఈఆర్‌ఓగా, ఏఈర్‌ఓలుగా కూకట్‌పల్లి, మూసాపేట్, బోయిన్‌పల్లి సర్కిల్‌ల డీసీలు ముగ్గురు, బాలానగర్, కూకట్‌పల్లి ఎంఆర్‌ఓలు ఇద్దరు, ప్రాజెక్ ఆఫీసర్ ఒకరు,ఏఎంసీలు నలుగురు, 41 మంది సూపర్ వైజర్‌లు వారి కింద 417 మంది బిఎల్‌ఓలు, అది కాకుండా మరికొంత మంది సపోర్టింగ్ సిబ్బంది సుమారు 5 వందల మంది విధులలో ప్రత్యేక్షంగా, పరోక్షంగా పాల్గొన్నారు.

కూకట్‌పల్లి నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో పని చేసిన 417 మంది బిఎల్‌ఓలకు రావలసిని మొత్తం రూ.39 లక్షల రూపాయల బిల్లులకు సంబంధించిన నివేదిక జిల్లా కలెక్టర్ కార్యాలయానికి పంపించడం జరిగిందని, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ వద్ద పెండింగ్‌లో ఉందని, త్వరలో నిధులు విడుదల అవుతాయని అధికారులు చెబుతున్నారు.ఇప్పటి వరకు అధికారుల నుండి వేతనాల విషయం లో ఎలాంటి హామీ లేదని బి ఎల్ ఓ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రాత్రింబవళ్లు కష్టపడ్డ బి ఎల్ ఓల వేతనాలు చెల్లించాలని వేడుకుంటున్నారు.