19 August, 2026 | 11:59 PM

చేపల పెంపకం యూనిట్ ను పరిశీలించిన పీఆర్ డిప్యూటీ కమిషనర్

19-08-2026 09:52 PM

ములకలపల్లి,(విజయక్రాంతి): ములకలపల్లి మండలం చౌటిగూడెం కాలనీ శ్రీదివ్య సంఘం సభ్యురాలు వాడే రజిత బ్యాంకు, పీఎంఈజిపి ద్వారా వ్యక్తిగతంగా నిర్వహిస్తున్న కొర్రమీను చేపల పెంపకం యూనిట్ ను బుధవారం పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ డిప్యూటీ కమిషనర్ జాన్ వెస్లీ పరిశీలించారు. యూనిట్ నెలకొల్పిన విధానం చేపలకు వచ్చే వ్యాధులు వాటి ఆహారం మార్కెటింగ్ విధానంపై లబ్ధిదారులతో మాట్లాడారు.

మండలానికి ఇచ్చిన ఫార్మ్ పాంట్స్ అన్ని మంజూరు తీసుకొని తక్షణమే ప్రారంభించాల్సిందిగా ఎంపీడీవో ఏపీవో కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్, డిఆర్డిఓ విద్యా చందన, డిపిఓ అనూష, జడ్పీ సీఈఓ నాగలక్ష్మి, సర్పంచ్ తానం  పద్మ, ఎంపీడీవో సత్యనారాయణ, ఏపీఎం రామ్ కుమార్, ఏపీవో హుస్సేన్, సీసీలు వెంకటేశ్వర్లు, ఉపేందర్, ఈసీ, టెక్నికల్ అసిస్టెంట్లు ఫీల్డ్ అసిస్టెంట్లు, గ్రామ సమాఖ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు.